విద్యారంగానికి పెద్దపీట: డిప్యూటీ సీఎం కడియం

Fri,December 22, 2017 09:52 PM

principal of the academic sector deputy chief minister kadiyam srihari

ఆత్మకూరు : ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ, ఆత్మకూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారని వారి ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు.

ప్రపంచ దేశాలకు దీటుగా విద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేజీ టు పీజీని ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 544 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యారంగం నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం కడియం ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టునున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిత, వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీడీవో నర్మద, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, వరంగల్ గ్రెయిన్ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు, ఎంపీపీ గోపు మల్లికార్జున్, జెడ్పీటీసీలు లేతాకుల సంజీవరెడ్డి, పాడి కల్పనదేవి, పాల్గొన్నారు.

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles