నిజామాబాద్ క‌లెక్ట‌ర్‌కు పీఎం ఎక్స్‌లెన్స్ అవార్డుFri,April 21, 2017 04:47 PM

Prime Minister's Awards for Excellence in Public Administration 2017

ఢిల్లీ: రైతు తన పంటను జాతీయ స్థాయిలో అమ్ముకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-నామ్(ఎలక్ట్రానిక్-జాతీయ వ్యవసాయ మార్కెట్)విధానం అమలులో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ-నామ్ అమలులో అత్యుత్తమ సేవలకుగానూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది.
నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ యోగితారాణా ఈ రోజు పీఎం అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నారు. సివిల్ స‌ర్వీస్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ అవార్డు అంద‌జేశారు.అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, రూ.10 లక్షల నగదును అందజేశారు
ఈ-నామ్ అమ‌లులో మంచి ప‌నితీరుకు గాను అవార్డు వ‌రించింది. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ... రైతుల‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి అవార్డును అంకిత‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ-నామ్ అమలులో ఉన్న 225 మార్కెట్ల నుంచి 14 మార్కెట్లను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వీటిల్లోంచి తుదిపోటీకి నిజామాబాద్, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ మార్కెట్‌ను ఎంపిక చేశాయి. చివరికి నిజామాబాద్ మార్కెట్‌ను విజేత నిలిచింద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.
నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయస్థాయిలో మొదటి స్థానం దక్కినందుకు సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ క‌విత‌ అభినందనలు తెలిపారు.

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS