కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి

Tue,December 19, 2017 02:46 PM

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మరికాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ర్టపతి పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రాయానికి మధ్యాహ్నం 3.40 గంటలకు చేరుకుంటారు. రాష్ట్రపతికి విమానాశ్రయంలో ప్రముఖులు స్వాగతం పలుకుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటల వరకు ఎల్బీస్టేడియంలోనే ఉంటారు. తిరిగి 7.25 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.


బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు పలువురిని కలుస్తారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ద విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles