అభిలాష్‌ను అభినందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Fri,March 15, 2019 09:16 PM

President Ram Nath Kovind congratulated to abhilash

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అభిలాష్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జరిగిన నేషనల్ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ అవార్డు కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిచారు. తెలంగాణ జాతీయ ఎగ్జిబిషన్‌లో మూడో స్థానంలో నిలిచిన మర్రిపెల్లి అభిలాష్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌ను గాంధీనగర్‌లో జరిగిన జాతీయస్థాయి ఇన్నోవేషన్ కార్యక్రమంలో ప్రదర్శించారు. దాదాపు 60 అధునాతన యాంత్రాలు ఈ ప్రదర్శనలో ఉండగా అభిలాష్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని రాష్ట్రపతి పరిశీలించడంతో పాటు అభిలాష్‌ను అభినందించారు. అభిలాష్ వెంట హన్మాజీపేట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, గైడ్ వెంకటేశం ఉన్నారు.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles