హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్

Sat,August 4, 2018 07:46 PM

President Ram Nath Kovind arrives in Hyderabad

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లోనే బసచేయనున్నారు. ఆదివారం రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారంలో పాల్గొంటారు. అనంతరం ఆదివారం ఉదయం 10:30గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటనున్నారు. ఆ తరువాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై వెళ్లనున్నారు.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles