సిలికాన్ వర్సిటీ స్థాయికి హైదరాబాద్ ఐఐటీ ఎదగాలి..

Sun,August 5, 2018 01:12 PM

President Kovind addresses 7th convocation of IIT Hyderabad

సంగారెడ్డి : అమెరికాలోని సిలికాన్ యూనివర్సిటీ స్థాయికి హైదరాబాద్ ఐఐటి ఎదగాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని హైదరాబాద్‌ ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐఐటీలో కోర్సు పూర్తి చేసుకున్న 560 మంది విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని మరింతముందుకు తీసికెళ్లాడనికి ఐఐటీ విద్యార్థులు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు సాధించిన పట్టాలు ఉద్యోగాలు, ఉపాధి కొరకు మాత్రమే కాకుండా ఉన్నత సంస్థల స్థాపనకు తోడ్పడాలన్నారు. ఐఐటి హైదరాబాద్ తక్కువ కాలంలోనే ఎన్నో రికార్డులను నెలకొల్పిందని చెప్పారు. మలేరియాపై రీసెర్చ్ చేసిన రోనాల్డ్ రాస్ లాంటి వారు ఇక్కడి నుండి వెళ్లినవారేనని రాష్ట్రపతి గుర్తు చేశారు. విద్యార్థులతో సమానంగా విద్యార్థినిలు సమాన సంఖ్యలో విద్యాబ్యాసం పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్ రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles