సాగర్‌ను సందర్శించిన రాష్ట్రపతి కుంటుంబసభ్యులు

Sat,December 22, 2018 07:14 PM

నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు సందర్శించారు. హిల్‌కాలనీ విజయవిహార్‌కు చేరుకున్న వీరికి నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. విజయవిహార్‌లో అల్పహారం తీసుకొన్న అనంతరం నాగార్జునసాగర్ డ్యాం వద్ద క్రస్ట్‌గేట్లు, గ్యాలరీతో పాటు లిఫ్టులో 420 లెవల్ వరకు వెళ్లి మరీ దిగువ భాగాన్ని పరిశీలించారు. అనంతరం ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ విధానాన్ని పరిశీలించారు. వీరితో టూరిజం ఎండీ మనోహర్, టూరిజం హోటల్ మేనేజర్ జోయల్, ఆర్డీఓ జగన్నాథరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, డీటీ శరత్‌చంద్ర, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

2868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles