గ్రంథాలయాలకు పూర్వవైభవం: హరీశ్‌రావు

Thu,November 14, 2019 10:14 PM

సిద్దిపేట : గ్రంథాలయాలకు సీఎం కేసీఆర్ పూర్వవైభవం తెస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనంతో మేధస్సు పెరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాలను నిర్మిస్తుందన్నారు. సిద్దిపేటలో రూ.2 కోట్లతో అధునాతన గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అధునాతనంగా నిర్మిస్తున్న లైబ్రరీలో విద్యార్థులకు, మహిళలకు, పోటీ పరీక్షల వారి కోసం ప్రత్యేక బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


అదే విధంగా గ్రంథాలయ ఉద్యోగులకు, చైర్మన్‌కు ప్రత్యేక క్యాబిన్ నిర్మిస్తున్నామన్నారు. 53వ గ్రంథాలయ వారోత్సవాలు అక్కడే ఘనంగా జరుపుకుందామన్నారు. యువత సెల్‌ఫోన్ మోజులో పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని, సమయం వృధా చేస్తున్నారన్నారు. పుస్తకాలకు దగ్గరై సెల్‌ఫోన్‌కు దూరం కావాలని సూచించారు. కొత్తగా 7 మండలాల్లో నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠకులకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రూ.40 లక్షలతో కొత్త పుస్తకాలను తీసుకవస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవంలో పాల్గొని మంత్రి హరీశ్‌రావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles