108లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Thu,March 21, 2019 12:54 PM

Pregnant delivers in 108 ambulance at Uppal

హైదరాబాద్ : 108 అంబులెన్స్‌లో నిండు గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డను కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. నాగోల్‌కు చెందిన ఓ గర్భిణికి ఇవాళ ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గర్భిణిని కోఠి ప్రసూతి వైద్యశాలకు అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఉప్పల్ వచ్చేసరికి ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను రోడ్డు పక్కకు నిలిపివేసి.. ఈఎంటీ నరేశ్, పైలెట్ భద్రు నాయక్ గర్భిణికి పురుడు పోశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డను కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles