20న సగర ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుSun,August 13, 2017 06:36 AM

20న సగర ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగర(ఉప్పరి)ఉత్తమ విద్యార్థులకు ఈనెల 20న నగరంలోని రవీంద్రభారతిలో ఉత్తమ విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు, అవార్డులు అందజేయనున్నట్లు అఖిల భారత సగర మహాసభ అధ్యక్షులు ముత్యాల హరికిషన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. అఖిలభారత సగర మహాసభ, సగర క్షత్రీయ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న సగర విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లోమా, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ, ఐఐటీతో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులతో పాటు పై కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా బంగారు, వెండి, కాంస్య పతకాలు, నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు www.akhilabharathasagara.com & sagaramahasabha<\@> gmail.com లో అప్లికేషన్‌తో పాటు సర్టిఫికెట్స్ జతచేసి ఈనెల 18లోపు పంపించాలన్నారు. వివరాలకు ఫోన్ 9949005006, 9246547787లను సంప్రదించాలని కోరారు. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

1013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS