ప్రణయ్‌ను చంపించింది మా నాన్నే : అమృత

Sat,September 15, 2018 12:53 PM

నల్లగొండ : ప్రణయ్‌ను చంపించింది మా నాన్నే అని అమృత తెలిపింది. మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో అమృత చికిత్స పొందుతోంది. అయితే ప్రణయ్ హత్యకు గల కారణాలపై అమృతను మీడియా సంప్రదించగా కొన్ని విషయాలను వెల్లడిచింది. ప్రణయ్‌ను చంపేందుకు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించారని చెప్పింది. మా నాన్న ఆలోచనల గురించి మా అమ్మ ఎప్పటికప్పుడు చెప్పేది. అబార్షన్ చేయించుకోవాలని మా నాన్న ఒత్తిడి తెచ్చేవాడు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. నిన్న ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వచ్చి క్షణాల్లో ప్రణయ్‌పై దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి జీన్స్, వైట్ విత్ బ్రౌన్ కలర్ చెక్స్ ఉన్న షర్ట్ ధరించాడు. అయితే ప్రణయ్‌కు ఎవరితోనూ గొడవలు లేవు. మంచి వ్యక్తి. ప్రణయ్‌ను హత్య చేయించింది మా నాన్నే. నిన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేశాడు. కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ప్రణయ్‌పై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేవారని తెలిపింది. ప్రణయ్ ఎక్కడున్న విషయం మా నాన్నకు క్షణాల్లో తెలిసేది. ఆ విషయాలు మా అమ్మ నాకు చెప్పేదని అమృత వెల్లడించింది. ఇప్పుడు తాను మా నాన్న వద్దకు వెళ్లనని.. మంచి భర్తను కోల్పోయానని అమృత బోరున విలపించింది.

6675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles