తెలంగాణ ప్రజల ఆదరణ ఆనందాన్ని కలిగించింది: ప్రధాని సోదరుడు

Sat,November 17, 2018 10:08 AM

prahlad modi visits Vemulawada temple

రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రజల ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని ప్రహ్లాద్ మోదీ ఈ ఉదయం దర్శించుకుని కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరణ, గౌరవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వరంగల్‌లో జరిగిన పూజారి హత్య చాలా బాధాకరమన్నారు. గోవధ, పూజారుల హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియా అన్న ప్రధాని మోదీ నినాదం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో దేశం ముందుకుపోతుందని పేర్కొన్నారు.

2372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS