సీఎం కేసీఆర్ కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ

Sun,June 16, 2019 02:41 PM

Prahlad joshi wrotes a letter to cmkcr


హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ తోపాటు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీ ల అధినేతలకు కేంద్రం లేఖ రాసింది. అజెండాలో తొలి అంశంగా పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, రెండో అంశంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు, మూడో అంశంగా 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, 4వ అంశంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, 5వ అంశంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని చేర్చారు. ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని ఆయా పార్టీల అధినేతలను ఆహ్వానించారు. ఈ నెల 19న ప్రధాని మోదీ 5 లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

2106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles