ప్రగతి నివేదన సభా ప్రాంగణం శుభ్రం

Mon,September 3, 2018 12:38 PM

Pragathi Nivedana Sabha have been cleaned up by our party volunteers and workers

హైదరాబాద్ : ప్రగతి నివేదిక సభా ప్రాంగణాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు శుభ్రం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సభ సందర్భంగా ఆ ప్రాంగణంలో వాటర్ బాటిల్స్, ఇతర పదార్థాలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఆ పదార్థాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలగకుండా ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు అక్కడ పేరుకుపోయిన చెత్తను తరలిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
5041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles