పోస్టల్ ఉద్యోగాలిస్తామని మోసం

Fri,March 15, 2019 10:12 PM

postal jobs fraud in adilabad

ఆదిలాబాద్ : నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 11న పోస్టాఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోర్‌స్కేర్ సంస్థ నిర్వాహకులు పట్టణ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేసిన ప్రధాన నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని ల్యాప్‌టాప్, రిజిస్టర్లు, అపాయింట్‌మెంట్ లెటర్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నిరుద్యోగులను మోసం చేసిందని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 300మంది బాధితులు ఉంటారని తెలిపారు. రూరల్ పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించగా.. ఇప్పటి వరకు 8మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles