కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్యే..

Mon,September 16, 2019 08:38 PM

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. కోడెల శివప్రసాద్ పోస్టుమార్టం ప్రాథమిక సమాచారం పోలీసులకు అందింది. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. శివప్రసాద్ మెడ భాగంలో తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో ఉందన్నారు. అయితే మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు ఆనవాళ్లు గుర్తించారు. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా వైద్యులు ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉంచారు. కోడెలకు నివాళులర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంగళవారం ఉదయం కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని గుంటూరు జిల్లాకు తరలించనున్నారు.

2531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles