అంగన్‌వాడీల్లో ‘పోషణ్ పక్వడా’

Sat,March 16, 2019 08:37 AM

poshan pakhwada in anganwadis telangana state

హైదరాబాద్ : విద్యతో పాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పూట సంపూర్ణ భోజనం కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులకు ఆటపాటలతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఇదిలావుండగా ప్రధాని నరేంద్రమోడీ మార్చి 8, 2018లో పోషణ్ అభియాన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే పోషణ్ అభియాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని మార్చి 8న ప్రారంభించింది. మార్చి 22 వరకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని ప్రణాళికలు రూపొందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వివిధ శాఖలను సమన్వపర్చుకొని కార్యక్రమాలలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించిన మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకాహార లోపాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగేండ్ల కిందట ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.

7 నెలల నుంచి మూడేండ్ల పిల్లలకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందిస్తున్నారు. వారికి బాలామృతం, నెలకు 16 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలు అంగన్‌వాడీ కేంద్రానికి రావడంతో వారికి విద్యతో పాటు ఆటపాటలు నేర్పిస్తూ ఒక్క పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. వారికి రోజుకు ఒక రకమైన కూరగాయలు చేసి పెట్టడంతో పాటు కోడిగుడ్లు ఇస్తున్నారు. గర్భిణులకు ప్రతి రోజు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు కోడిగుడ్డు పెడుతున్నారు. బాలింతలకు ఆరు నెలల వరకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు కోడి గుడ్డు ఇస్తున్నారు.

వివిధ శాఖల సమన్వయంతో...


2022 వరకు పోషకాహార లోపాన్ని నివారించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి 22 వరకు చేపడుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖనే కాకుండా వైద్య, ఆరోగ్య, విద్య, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేట్, పంచాయతీరాజ్ రోడ్స్ డెవలప్‌మెంట్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పౌష్టికాహారం, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపై అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు ...


* మార్చి 8న ప్రెస్ కాన్ఫరెన్స్
* 9న అన్నప్రసాద, అక్షరాభ్యాసాలు
* 10న పోషకాహారంపై అవగాహన కల్పించడానికి ర్యాలీ
* 11న పాఠశాలల్లోని కిశోర బాలికలకు రక్తహీనతపై అవగాహన శిబిరం
* 12న ఎస్‌హెచ్‌జీఎస్, మండల సమాఖ్య సమావేశాలు
* 13న పాఠశాలలో పౌష్టికాహారం, ఆరోగ్యం, పెరుగుదలపై అవగాహన
* 14న యువజన సంఘాలతో సమావేశం (కిట్స్, వ్యాసరచన, వక్తత్వ పోటీలు)
* 15న ఎస్‌హెచ్‌జీఎస్, వీవోలతో సమావేశాల్లో పౌష్టికాహారంపై అవగాహన
* 16న రైతు క్లబ్‌ల సమావేశం(పోషకాహారం, కిచెన్ గార్డెన్‌లపై అవగాహన)
* 18న యువజన సంగాలతో సమావేశం (మరుగుదొడ్లు, న్యూట్రీ గార్డెన్స్‌పై అవగాహన)
* 19న రైతు క్లబ్‌ల సమావేశం(ఉపాధి హామీ పథకం ద్వారా న్యూటీ గార్డెన్స్‌ను పెంపొందించడంపై అవగాహన)
* 20న రక్తహీనత నివారణపై అవగాహన శిబిరాలు
* 21న పోషణ్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ
* 22న సామూహిక సీమంతాలు, అన్నప్రసాద, అక్షరాభ్యాసం

2169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles