పరిషత్ ఎన్నికల్లో 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇవే..

Mon,May 6, 2019 10:28 AM

polling percentage as of morning 9 in parishad elections in telangana

హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 16.07 శాతం పోలింగ్ నమోదయింది. నల్గొండ జిల్లాలో ఉదయం 9 వరకు 13.03 శాతం, సూర్యాపేట జిల్లాలో 21.4 శాతం, కరీంనగర్ జిల్లాలో 17.36 శాతం, జగిత్యాల జిల్లాలో 18 శాతం, సిరిసిల్ల జిల్లాలో 22.69 శాతం, నారాయణపేట జిల్లాలో 19.08 శాతం, వికారాబాద్ జిల్లాలో 10 శాతం, సంగారెడ్డి జిల్లాలో 18.29 శాతం, జనగామ జిల్లాలో 14.68 శాతం, నాగర్ కర్నూల్ జిల్లాలో 14.24 శాతం, వనపర్తి జిల్లాలో 18 శాతం, పెద్దపల్లి జిల్లాలో 18.96 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 12.28 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 17.65 శాతం, మెదక్ జిల్లాలో 22.32 శాతం నమోదయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles