పోలింగ్ కేంద్రాలకు బయల్దేరుతున్న సిబ్బంది

Thu,December 6, 2018 04:22 PM

Polling officers goes to polling booths in telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు హుషారుగా బయల్దేరుతున్నారు. వారికి కేటాయించిన బస్సుల్లో గ్రామాలకు వెళ్తూ సందడి చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది వెంట పోలీసులు పహారాగా వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఈ 13 నియోజకవర్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు.1443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles