పోల్ ఆఫీస‌ర్‌ను కొట్టిన ఓట‌ర్లు !

Fri,December 7, 2018 03:29 PM

మేళ్ల‌చెరువు: సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌లో ఓ పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి చేశారు. మేళ్ల‌చెరువు మండ‌లంలోని వెల్ల‌టూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన దివ్యాంగ వృద్ధురాల‌కు సహాయ‌ప‌డేందుకు వ‌చ్చిన పోల్ ఆఫీస‌ర్‌.. ఓట‌రు ఇష్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఆ వృద్ధురాలు టీఆర్ఎస్‌కు ఓటు వేయాల‌నుకున్న‌ది. కానీ ఆ పోల్ ఆఫీస‌ర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద‌ నొక్కారు. దీంతో ఆ ఓట‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత అక్క‌డ ఉన్న ఓట‌ర్లుకు, పోల్ సిబ్బందికి మ‌ధ్య‌ వాగ్వాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి చేశారు. విధుల్లో ఉన్న మిగ‌తా పోల్ సిబ్బంది.. ఆ పోల్ ఆఫీస‌ర్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించారు. ఈ ఘ‌ట‌న‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ వివ‌ర‌ణ కోరారు.

4740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles