మహబూబ్‌నగర్‌ జిల్లాలో 73.68 శాతం పోలింగ్ నమోదు

Fri,May 10, 2019 10:45 PM

polling completed peacefully in erstwhile mahabubnagar dist

మహబూబ్‌నగర్: జిల్లా వ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,31,184
ఓటర్లకు గాను 1,70,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 73.68% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో 76.37% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హన్వాడ మండలంలో 71.89% ఓటింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

నారాయణపేట జిల్లాలో 72.47% పోలింగ్


నారాయణపేట జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో 72.47% పోలింగ్ నమోదైంది. మొత్తం 1,43,126 మంది ఓటర్లకు గాను 72.47% తో 1,03,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముంబై, రాయిచూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ఓటర్లందరూ తమ తమ గ్రామాలకు తిరిగి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఆరంభం కాగానే కలెక్టర్ వెంకట్రావు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పౌసమి బస్ నర్వ.. ఉట్కూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డా.చేతన ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వనపర్తి జిల్లాలో 75.18 శాతం పోలింగ్ నమోదు


వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో (పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత) జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎలాంటి అలజడులు లేకుండా ముగిశాయి. జిల్లాలో 75.18 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు మండలాల్లో 1,11,831 మంది ఓటర్లుండగా, 84,070 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరచింత మండలంలో 78.48 శాతం అత్యధికంగా, అత్యల్పంగా పెద్దమందడి మండలంలో 72.21 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో 76.74 శాతం


నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ నిర్వహించిన పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మలివిడతలో భాగంగా జిల్లాలో 5 జడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 185 మంది బరిలో నిలిచారు. మొత్తంగా 76.74 శాతం పోలింగ్ నమోదు కాగా, 5 మండలాలలో మొత్తం 1,43,066 మంది ఓటర్లకుగాను 1,09,799 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 56,222 కాగా, స్త్రీలు 53,577 ఉన్నారు.

581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles