రాజకీయ నిర్ణయాలు త్వరలో తీసుకుంటాం : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 08:21 PM

Political decisions will take soon says CM KCR

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం రాజకీయ నిర్ణయాలు త్వరలోనే తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ రద్దు చేస్తారని, కొత్త పథకాలు ప్రవేశపెడుతారని కొన్ని రోజుల నుంచి పేపర్లు, టీవీలు రాశాయి. ఇలా రాయడం భావ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. రాజకీయంగా తెలంగాణ రాష్ర్టానికి, టీఆర్‌ఎస్, ప్రజల భవిష్యత్‌కు ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకోండని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తనకు చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఆ నిర్ణయాలన్నింటినీ మీకు చెప్తానని సీఎం తెలిపారు. కొత్త పథకాలు ప్రవేశపెడుతారని రాశారు. అది ధర్మం కాదు. మాట అన్నమంటే అమలు చేయాలి. త్వరలోనే కే కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేస్తాం. టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది మేనిఫెస్టోలో చెప్తాం. త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని అంశాలను వివరంగా చెప్తామని సీఎం తెలిపారు. అధికారంలో ఉంటే ఆత్మగౌరవంతో ఉంటాం. నిరుద్యోగులను కూడా ఆదుకుంటాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

4937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles