ఫిబ్రవరి 3 న పోలియో చుక్కల పంపిణీ

Sat,January 12, 2019 08:34 AM

polio vaccine distribution will be held on february 3rd

రంగారెడ్డి: సమాజంలో పోలియో వ్యాధి ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా ఫిబ్రవరి 3న పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వీలుగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిలా కలెక్టర్ లోకేశ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ కోర్టు హాల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ 0-5 సంవత్సరాల వయస్సు కలిగిన 3లక్షల 57వేల మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సి ఉందని ఇందుకు గాను 1600 పోలియో బూత్‌లు, 73 మొబైల్ బృందాలు, 40 ట్రానిట్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

498 సున్నితమైన ప్రాంతాల్లో 7వేల మంది పిల్లలు ఉంటారని వీరందరికీ పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. మొదటి రోజు 100 శాతం పూర్తి చేయాలని మిగిలిన వారు ఉంటే ఫిబ్రవరి 4, 5 తేదీలలో పోలియో చుక్కలు వేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేకంగా బూత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, మురికి వాడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించి 5 సంత్సరాల పిల్లలందరికీ చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డీఐఓ గణేశ్, డీఆర్‌డీఓ ప్రశాంత్‌కుమార్, డీఈఓ సత్యనారాయణరెడ్డి, డీపీఓ పద్మాజారాణి, మహిళా సంక్షేమ అధికారి సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles