ప్రజలకు మెరుగైన సేవలందించాలిః సీపీ మహేష్‌భగవత్

Tue,November 19, 2019 08:44 PM

చౌటుప్పల్ : పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలందించి వారి అభిమానాన్ని చూరగొనాలని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌భగవత్ పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు తీరుతెన్నులను పరిశీలించారు. మున్సిపాల్టీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రిసిప్షెన్ కేంద్రాన్ని పరిశీలించారు.


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ అన్ని హంగులతో తీర్చిదిద్దాలన్నారు. పోలీసు కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలతో మమేకవుతూ పనిచేయాలన్నారు. ఫిర్యాదులను స్వీకరించి సాధ్యమైనంత తొందరగా కేసులను నమోదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పకడ్భందిగా అమలు చేయాలన్నారు.

537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles