కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయి పట్టివేత

Thu,April 18, 2019 09:50 PM

Police seize 150 kg marijuana worth Rs 19 lakh from a car

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు కారులో తరలిస్తున్న రూ. 19.5 లక్షల విలువ చేసే 150 కిలోల గంజాయిని పాల్వంచ పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ మధుసూదన్‌రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. పాల్వంచలోని బస్టాండు ఎదురుగా సీఐ మడత రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బూర్గంపాడు మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన దుగ్గెంపుడి శివశంకర్‌రెడ్డి కారు డ్రైవర్ అదే గ్రామానికి చెదిన మహ్మద్ షేర్‌ఖాన్‌తో కలిసి టీఎస్ 12ఈసీ 5956 నెంబర్ కలిగిన ఇండిగో కారులో గంజాయిని 5కేజీల ప్యాకెట్స్ 30 ప్యాకెట్లును కారు డిక్కీలో వేసి మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు తరలిస్తున్నారు. ఈ గంజాయిని ఒరిస్సా రాష్ర్టానికి చెందిన బిస్వాన్, శ్యామర్ అనే వ్యక్తులతో ఒరిస్సా నుంచి భద్రాచలానికి తెప్పించుకుని నారాయణ ఖేడ్‌కు తీసుకెళ్తున్నారని, ఈ క్రమంలో పాల్వంచలో వాహన తనిఖీల్లో గంజాయి పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి గతంలో ఆఫ్రికా ఖండంలోని కెన్యా, సుడాన్ దేశంలో పనిచేసి వచ్చాడని, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సదరు వ్యక్తి సులభంగా డబ్బు సంపాధించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేస్తున్నాడన్నారు. ఈ గంజాయిని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలోని పిట్లం గ్రామానికి చెందిన ధర్మారెడ్డి, జయపాల్‌రెడ్డిలకు అమ్ముతున్నట్లు డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో సీఐ మడత రమేష్‌గౌడ్, ఎస్సై ముత్యం రమేష్ పాల్గొన్నారు.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles