ఆదిలాబాద్‌లో రూ.10 కోట్ల నగదు పట్టివేత

Fri,October 19, 2018 06:57 PM

police seized 10 crore rupees in adilabad

జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అంతరాష్ట్ర రహదారి పిప్పర్ వాడ టోల్‌ప్లాజా వద్ద ఇవాళ సాయంత్రం పోలీసు తనిఖీల్లో భాగంగా రూ.10 కోట్ల నగదును పట్టుకున్నారు. నాగ్‌పూర్ జిల్లాలోని జామ్ గ్రామం నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో టోల్‌ప్లాజా వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన తనిఖీ శిబిరంలో ఏఎస్సై జీవన్‌కుమార్, పంచాయతీ అధికారి ఈవోఆర్డీ సంజీవ్‌రావు బృందాలు తనిఖీలు నిర్వహించగా.. కెఏ 46ఎన్ 6096 నంబర్ ఉన్న డస్టర్ వాహనంలో తనిఖీలు నిర్వహించారు.

గన్నీ సంచుల్లో రూ.10 కోట్ల నగదు బయటపడింది. ఎస్పీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింహారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పట్టుకున్న డబ్బుల వివరాలు సేకరించారు. బియ్యం నింపే తెల్లటి గన్నీ బ్యాగుల్లో రూ.500, రూ.2000 నోట్ల కట్టలను డిక్కీలో వేసుకొని తీసుకెళ్తున్నారు. వాహనంలో కర్ణాటకకు చెందిన వినోద్‌శెట్టి, శబరీష్ అనే వ్యక్తులు ఈ డబ్బులను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి రసీదులు చూపకపోవడంతో డీఎస్పీ నగదును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో సూర్యనారాయణ, సీఐ స్వామి, ఎస్సై తిరుపతితో పాటు ఫ్లయింగ్ స్కాడ్ డీటీ ప్రభాకర్, డీటీ రమేశ్, వీఆర్వో కమల, ఇతర రెవెన్యూ, పోలీసు అధికారులు మోహిజ్ తదితరులు ఉన్నారు.

9507
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles