
మహబూబబాద్ : జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నరేష్ కుమార్, బయ్యారం సీఐ రమేష్ కార్డన్ సెర్చ్ చేపట్టారు. 200 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలలను సీజ్ చేయడంతో పాటు అక్రమ మద్యం, బెల్లం, రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.