కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభించిన హోంమంత్రి

Sat,June 15, 2019 11:27 AM

police center command control warangal mamnoor

వరంగల్: మామునూర్‌లోని నాలుగో బెటాలియన్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు స్టేడియం, రెండు పోలీస్‌స్టేషన్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మంచి పేరు సాధించారని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అంతటా హింస జరిగితే, ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కిందన్నారు. కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి మూడు కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles