ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Thu,June 20, 2019 02:50 PM

police cases file on mla raja singh

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఐపీసీ 143, 145, 152, 153(ఏ), 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి కొందరు యువకులు ప్రతిష్ఠాపన చేసేందుకు యత్నించారు. పాత విగ్రహం తొలగించి కొత్తది పెట్టే యత్నం చేశారు. గత విగ్రహం కన్నా పెద్దది ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోలేదు. 25 అడుగుల విగ్రహం పునఃప్రతిష్ఠించేందుకు యత్నించారు. అనుమతిలేని కారణంగా పోలీసులు ఈ చర్యను అడ్డుకున్నారు. ఆ సమయంలో రాజాసింగ్ అక్కడికి చేరుకుని యువకులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు.

2920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles