కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి సీతారాం ఎంపిక

Fri,September 8, 2017 04:10 PM

poet Sitaram elected to Kaloji award for 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి గానూ కాళోజీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి సీతారాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును సీతారాంకు ప్రభుత్వం అందజేయనుంది. ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా సీతారాంను ప్రభుత్వం సన్మానించి పురస్కారాన్ని అందజేయనుంది. గతేడాది ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు, 2015 ఏడాదికి గానూ సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

3664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles