బృహత్ కవి సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పోచారం

Sun,December 17, 2017 12:25 PM

Pocharam Srinivas reddy participate in Telugu Mahasabhalu

హైదరాబాద్ : ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా బృహత్ కవి సమ్మేళనం కొనసాగుతోంది. ఈ సమ్మేళనానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కవులకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభిమానులు ఆశీర్వదించే విధంగా సభలు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఎందరో గొప్ప కవులున్నారని ఈ సభల ద్వారా తెలిసిందని మంత్రి తెలిపారు. తెలంగాణ వంటకాల లాగే తెలంగాణ భాష కూడా ఆరోగ్యకరమైందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

2002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles