వ్యవసాయ పరికరాల పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి పోచారం భేటీ

Thu,June 21, 2018 07:54 PM

Pocharam Srinivas reddy meets with Agri equipment industry Representatives

హైదరాబాద్: వ్యవసాయ యంత్ర పరికరాల పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. విత్తనం వేసిన దగ్గర నుండి పంట నూర్పిడి వరకు అంతా యంత్రాల సహాయంతోనే జరగాలి. యంత్రాల వల్ల పెట్టుబడులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో మొత్తం కోటి ఇరవై లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీరందుతుంది. ఇంత భారీస్థాయిలో కూలీలు దొరకరు. కావునా ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతి మండలానికి పది చొప్పున రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 5 వేల వరి నాటే యంత్రాలను సబ్సిడిపై అందించనున్నట్లు వెల్లడించారు. మన దేశంలో చిన్న కమతాలు కలిగిన రైతులు ఎక్కువ. వారికి అనువైన యంత్రాలను అందుబాటులోకి తేవాలి. అదేవిధంగా విత్తనాలను విత్తుకోవడానికి అవసరమైన డ్రమ్ సీడ్ యంత్రాలను భారీ ఎత్తున రైతులకు అందించాలన్నారు.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles