సూర్యాపేట జిల్లా మార్కెట్లకు ఢిల్లీ అధికారుల బృందం రాక

Sat,March 2, 2019 08:26 PM

pm office officers visit suryapet district markets

- పీఎం అవార్డు ఎంపికకు పరిశీలన
సూర్యాపేట: దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నామ్ విధానానికి అవార్డులను ప్రకటించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం సభ్యులు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌తో పాటు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లను ఢిల్లీలో పీఎం కార్యాలయ అధికారులు గులాబ్ సింగ్, కైలాస్, మనోజ్‌ కుమర్ సింగ్ వేర్వేరుగా కలెక్టర్ అమయ్‌కుమార్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులు తెచ్చిన పంటలను పరిశీలించి మార్కెట్ కు వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ధరలు గతంలో కంటే ఈ-మార్కెట్ వచ్చిన తర్వాత ఏమైనా పెరిగాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మార్కెట్‌లో ధాన్యాన్ని ఏ విధంగా తూకం వేస్తున్నారని పరిశీలించారు.

దేశ వ్యాప్తంగా 585 మార్కెట్‌లలో ఈ నామ్ విధానం అమలవుతుండగా.. తెలంగాణ వ్యాప్తంగా 189 మార్కెట్‌లకు గాను 47 మార్కెట్‌లు పీఎం అవార్డు ఎంపికకు దరఖాస్తు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా 21 మార్కెట్‌లను ఎంపిక చేయగా అందులో 3 మార్కెట్‌లు తెలంగాణకు చెందినవి ఉన్నాయి.

ఈ అవార్డు చివరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3 మార్కెట్‌లు ఎంపిక కాగా అందులో జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరితో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన కేసముద్రం మార్కెట్‌లు ఉన్నాయి. వారి వెంట జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, జేడీఎంలు ఎల్లయ్య, మల్లేశం, మార్కెట్ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, సృజన్ కుమార్ తదితరులు ఉన్నారు.

2128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles