రూసా నిధులపై ఆదివారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్

Sat,February 2, 2019 09:45 PM

pm modi video conference on rusa funds with all universities vice chancellors tomorrow

-కేయూ రిజిస్ట్రార్ పురుషోత్తం వెల్లడి
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూసా నిధుల వినియోగంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశంలోని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం తెలిపారు.

జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో శ్రీనగర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐఎసీసీ)లో డిజిటల్ లాంచింగ్‌ను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దేశంలోని మహిళా యూనివర్సిటీ, 70 నూతన మోడల్ డిగ్రీ కాలేజీలు, 11 వృత్తి విద్య కళాశాలలు, 66 ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఇన్నోవేషన్, కారియబ్‌లను ఎంపిక చేసిందని.. ఈ నేపథ్యంలో ఈ డిజిటల్ లాంచింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ డిజిటల్ లాంచింగ్ కోసం కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన ఏర్పాట్లను శనివారం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, పరీక్షల నియంత్రాణాధికారి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కేయూలోని విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు హాజరుకావాలని కావాలని రిజిస్ట్రార్ పురుషోత్తం కోరారు.

1515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles