
విశాఖపట్నం: విశాఖపట్నంలోని విమానాశ్రయంలో రన్‌వేపై ఓ విమానానికి అడవిపంది అడ్డొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఇండిగో విమానం 160 మంది ప్రయాణికులు, సిబ్బందితో విశాఖపట్నం నుంచి బయలుదేరి.. టేక్ఆఫ్ (భూమిపై నుంచి పైకిలేచే క్రమం) చివరిదశలో ఉండగా రన్‌వేపై అడవిపంది కనిపించింది. దాన్ని తప్పిస్తూ విమానాన్ని పైకి తీసుకెళ్లిన పైలెట్.. 45 నిమిషాలపాటు ఆకాశంతో చక్కర్లు కొట్టి ఆ తర్వాత మళ్లీ అక్కడే దించారు. విమానానికి ఏమైనా నష్టం జరిగిందా తెలుసుకొనేందుకు ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని కిందికి దించినట్టు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాక గంటన్నర తర్వాత సేవలను పునరుద్ధరించినట్టు పేర్కొన్నది. ఇండిగో విమానం (6ఈ0742) విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు గాల్లోకి లేచే సమయంలో రన్‌వేపై ఓ అడవిపంది సంచరించింది. నిబంధనల ప్రకారం కెప్టెన్ విషయాన్ని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు అని ఎయిర్‌లైన్స్ తెలిపింది.