పిడమర్తి రవి విజయం ఖాయం: మంత్రి కేటీఆర్

Wed,November 14, 2018 01:57 PM

pidamarthi ravi victory conformed says minister ktr

ఖమ్మం: సత్తుపల్లిలో పిడమర్తి విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎమ్మెల్సీ బాలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి కృషి ఎంతో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో పిడమర్తి రవి అనుబంధం దశాబ్దాలదని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదని తెలిపారు. రైతుబీమాతో అన్నదాతల్లో ధీమా కల్పించినట్లు వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లికి గోదావరి జలాలు తరలిస్తామన్నారు. కాగా సీతారామ ప్రాజెక్టు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తుండని దుయ్యబట్టారు. సత్తుపల్లికి గోదావరి జలాలు కావాలంటే ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవాలని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం గురుకుల పాఠశాలలు కట్టించాం. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. సిద్దాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయి. కూటమి సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుంటమని కేటీఆర్ అన్నారు.

2776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles