జీవవైవిధ్యం- పర్యావరణం అంశంపై ఫొటోగ్రఫీ పోటీలు

Sun,May 5, 2019 04:48 AM

photography competitions on Biodiversity and environmental issues

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య మండలి, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో జీవవైవిధ్యం- పర్యావరణం అంశంపై ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ఎంట్రీ ఫీజులేదని, ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అమెచ్యూర్ క్యా టగిరీలో 10 నుంచి 25 ఏండ్లలోపు వారు, ప్రొఫెషనల్ క్యాటగిరీలో 25 ఏండ్లపైబడిన వారు ఎన్ని ఫొటోలనైనా ఈ-మెయిల్ ద్వా రా పంపించవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 11న నెహ్రూ జూలాజికల్ పార్క్ వేదికగా విజేతలను నేచర్ చాంపియన్లుగా ప్రకటిస్తామని, నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ కో-ఆర్డినేటర్ జీ సాయిలును మొబైల్‌నంబర్ 8886696404, లేదా వాట్సప్ నంబర్ 9908179665 లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles