కాళేశ్వరానికి రుణం ఇచ్చేందుకు పీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్

Fri,March 15, 2019 05:47 PM

PFC gives green signal to Kaleshwaram project for lending

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంగీకారం తెలిపింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌శర్మతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు. కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ నేడు సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్ల రుణం ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పీఎఫ్‌సీ త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయనుంది. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 18 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్‌సీ సూత్రపాయ అంగీకారం తెలిపింది.

1942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles