ప్రేమ గాథలు వినిపించనున్న ‘షెషర్ ఎ ఇష్క్’

Wed,February 14, 2018 05:05 AM

pesar e ishq in hyderabad

హైదరాబాద్.. ప్రేమ పునాదులపై నిర్మితమైన మహానగరం. భాగమతి, కుతుబ్‌షాహీల ప్రేమకు సజీవ సాక్ష్యం. ఇక్కడ అణువణువునా తొణికిసలాడే ప్రేమ తారసపడతుంది. మూసీనది పరవళ్లు మొదలు... చార్మినార్ చౌరస్తా వరకు... ప్రతి మలుపులోనూ ఓ ప్రేమ గాథ వినబడుతుంది. అలాంటి అపురూప గాథల్ని మనలోకి ఒంపేందుకు ముందుకు వస్తోంది హైదరాబాద్ ట్రయిల్స్. వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాదీలను ప్రేమలో ముంచెత్తేందుకు షహర్ - ఎ - ఇష్క్ సెలబ్రేషన్స్‌ని వెంటేసుకొస్తోంది. నేటి నుంచి నాలుగు రోజలు పాటు చారిత్రక గాథల్ని, సంగీత ప్రవాహాల్ని మన ముందు కుమ్మరించనుంది.

భాగమతి, కులీకుతుబ్‌షాహీల ప్రేమకు చిహ్నం ఈ భాగ్యనగరం. భాగమతిని కలిసేందుకు ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కే మూసీ నదిని దాటుకుంటూ వెళ్లేవాడు కుతుబ్‌షా. అతడి ఆరాటాన్ని చూసిన కులీ కుతుబ్‌షా తండ్రి మూసీ నదిపై వంతెనను నిర్మించాడు. అదే ఇవాల్టికీ మనకు కనిపించే పురానాపూల్. భాగమతి ప్రేమను పొందిన కుతుబ్‌షా ఆమె పేరుతోనే ఈ నగరాన్ని నిర్మించాడు. రెండు మతాల మధ్య ప్రేమకు, రెండు సంస్కృతుల సహజీవనానికి ఈ నగరం ఓ సాక్ష్యం. ఇలాంటి గాథలెన్నో ఈ నగరంలో తారసపడతాయి. వాటన్నింటినీ షహర్ - ఎ - ఇష్క్ సెలబ్రేషన్స్ పేరుతో వినిపించనుంది హైదరాబాద్ ట్రయిల్స్.

వైవిధ్యభరిత గాథలు
వాలంటైన్స్‌డే సందర్భంగా అసలైన ప్రేమకు అర్థాన్ని వెతుక్కుంటోంది నగరం. చారిత్రక కట్టడాల వెనుక గాథల్ని... ప్రేమ గీతాల్ని వినిపించనుంది. నాలుగు రోజలు పాటు నగరంలోని పలు వారసత్వ కట్టడాలను చుట్టూరా హెరిటేజ్ వాక్ నిర్వహించనుంది హైదరాబాద్ ట్రయిల్స్. ఆ నిర్మాణాల విశేషాలను వినిపించడంతో పాటు సూఫీ సంగీతంతో నగర వాసులను ముంచెత్తనుంది. చార్మినార్, నాంపల్లి, గోల్కొండ, పైగా టూమ్స్, కుతుబ్‌షాహీ టూమ్స్... ఇలా రోజుకో పర్యటన. ప్రతి పర్యటనలో పలకరించే వైవిధ్యభరిత గాథలు... ఈ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మీరు హెరిటేజ్ వాక్‌లో భాగం కండి మరి. మేరా ఈవెంట్స్ నుంచి టికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు.

కార్యక్రమాలు
* టేల్ అండ్ ట్యూన్స్ 14 ఫిబ్రవరి, రా. 7.30 గం. గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్
* ఏ సూఫీ నైట్ వాక్ ఇన్ నాంపల్లి తేది : 15 ఫిబ్రవరి, రా. 7.30గం. డైమండ్ కేఫ్ నుంచి
* ఏ నైట్ వాక్ ఇన్ చార్మినార్ తేది : 16 ఫిబ్రవరి, రా. 9.30గం. నయాబ్ హోటల్ నుంచి
* తాజ్‌మహల్ ఆఫ్ దక్కన్ తేది : 17 ఫిబ్రవరి, రా. 7.30గం. పైగా టూమ్స్
* దాస్తాన్ - ఏ - ఇష్క్ తేది : 17 ఫిబ్రవరి, సా. 4.00గం. కుతుబ్‌షాహీ టూమ్స్‌లో
* షహర్ - ఎ - ఇష్క్ తేదీ: 18 ఫిబ్రవరి, రా. 7.30గం. రెయిన్‌బో రెస్టారెంట్, అబిడ్స్
* అన్‌సీన్ గోల్కొండ తేది : 18 ఫిబ్రవరి, సా. 4గం. గోల్కొండ జీషన్ కేఫ్ నుంచి

1775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles