లాడ్జిలో ఉరేసుకొని వ్యక్తి మృతి

Tue,July 23, 2019 09:40 PM

person Suicide in lodge at suryapet

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ లాడ్జిలో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లికి చెందిన దోమ రామకృష్న(50) ఉద్యోగరిత్యా సూర్యాపేట పట్టణంలోని గొల్లబజారులో స్థిరపడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెల వివాహం జరిగింది. మృతుడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్ అటెండర్‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలేజీలో తనతో పాటు పని చేస్తున్న మహిళకు కొంత నగదు అప్పుగా వేరే వారి వద్ద రామకృష్ణ ఇప్పించాడు. నగదు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని అడుగగా రామకృష్ణ ఆ మహిళను డబ్బు ఇవ్వాలని అడుగుతున్నాడు. ఈ క్రమంలో సహ ఉద్యోగి లింగయ్య సైతం కలుగజేసుకొని వాయిదా వేస్తూ డబ్బులు ఇవ్వడం జాప్యం అయ్యింది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడం సదరు మహిళ డబ్బులు ఇవ్వడం దాటవేయడంతో మనోవేదన చెందిన రామకృష్ణ ఉరేసుకుని మృతి చెందినట్లు మృతుడి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జిలో మృతి చెందిన రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా మృతుడు సూసైడ్ నోటు రాసినట్లు సమాచారం.

632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles