నేరేడుచర్ల : తేనెటీగలు దాడితో వ్యక్తి మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన మత్స్యకార సహకార సంఘం ఉపాధ్యక్షుడు దారముల్ల సీతయ్య(52) గ్రామంలోని ఊర చెర్వుకు కాపాల ఉంటున్నాడు. చెర్వు కట్ట మీద నడుచుకుంటూ వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారి లేచి దాడి చేశాయి. పరుగు తీసినప్పటికీ వెంట పడి కుట్టడంతో సృహ తప్పి కింద పడిపోయాడు.
పరిసర ప్రాంతంలోని రైతులు గమనించి వెంటనే 108లో దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య పాపమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.