మూఢనమ్మకాలతో వ్యక్తి సజీవ దహనం

Thu,September 19, 2019 07:37 AM

మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేట పరిధి అద్రాస్‌పల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేతబడి నెపంతో కొందరు ఓ వ్యక్తిని కొట్టి చంపి కాల్చి పడేశారు. లక్ష్మి అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు మహిళ దహనసంస్కారాలు నిర్వహించారు. లక్ష్మి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి ఆంజనేయులు(24) అనే యువకుడు రాత్రి వెళ్లాడు. కాగా ఇప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇతడిపై అనుమానం ఉంది. ఆంజనేయులు చేతబడి చేయడంతోనే లక్ష్మి మృతిచెందినట్లు కుటుంబ సభ్యుల అనుమానం. దీంతో ఆంజనేయులును కర్రలతో తీవ్రంగా కొట్టి మహిళ చితిమంటల్లోనే వేసి సజీవ దహనం చేశారు.

2844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles