అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

Thu,February 28, 2019 01:31 PM

Performance measures for the conservation of forest lands minister indrakaran reddy

నిర్మ‌ల్ : అట‌వీ భూముల ప‌రిర‌క్ష‌ణ‌,అడ‌వుల సంర‌క్ష‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారిని ద‌ర్శించుకుని నిర్మ‌ల్ కు తిరిగి వ‌స్తుండ‌గా కుంటాల మండ‌లం అర్లి చెక్ పోస్ట్ వ‌ద్ద ఆగి ఆక‌స్మిక త‌న‌ఖీ నిర్వ‌హించారు. రిజిస్ట్ర‌ర్ ను ప‌రిశీలించి, సిబ్బంది వివ‌రాల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.... నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు, అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని అక్క‌డున్న అట‌వీ శాఖ అధికారులు ఆదేశించారు.

చెక్ పోస్ట్ ల వద్ద అక్రమ రవాణా పూర్తిగా నిరోధించే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. విధులను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌ని, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. అనంత‌రం మార్గ‌మ‌ధ్య‌లో అట‌వీ శాఖ అధికారుల‌తో క‌లిసి న‌ర్సాపూర్ స‌మీపంలోని అట‌వీ పున‌రుజ్జీవ‌న (అసిస్టెడ్ నేచుర‌ల్ రీజ‌న‌రేష‌న్) ప్రాంతాన్ని ప‌రిశీలించారు.

ఆక్రమణలు జరిగిన ప్రదేశాల్లో ట్రెంచింగ్ (కందకాలు తవ్వి) అటవీ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. వన్య ప్రాణుల దాహర్తి తీర్చడం కోసం సాసర్‌ పిట్స్‌, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాల‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో క‌వ్వాల్ ఫీల్డ్ డెరెక్ట‌ర్ వినోద్ కుమార్,డీ.ఎఫ్.వో. ప్ర‌సాద్,ఎఫ్.డీ.వో. గోపాల్ రావు, పీడీ వెంక‌టేశ్వ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles