ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి..

Fri,March 29, 2019 10:08 AM

People Should support CMKCR Leadership in Delhi says anil kurmachalam


లండన్ : పసుపు బోర్డు ఏర్పాటుకై ఎంపీ కవిత పోరాటానికి నాడే లండన్ లో సంఘీభావ దీక్షలు చేశామని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టి.ఆర్.యస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించి, ఢిల్లీ లో కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గత ఐదు సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం చేసిన కృషి చాలా గొప్పదన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో లండన్ వీధుల్లో రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పోరాటాలు చేసిన మేము మళ్ళీ పసుపు బోర్డు కై ఎంపీ కవిత పోరాటానికి సంఘీభావంగా లండన్ లో నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. దీనిబట్టి ఎంపీ కవిత ఎంత కృషి చేశారో నిజామాబాదు రైతులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఖండాంతరాల్లో ఉన్న మేము సైతం కదిలేలా పోరాటం చేశారు. కాబట్టి మళ్ళీ కవిత ను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కి పంపితే ఈ సారి తప్పకుండా కావలసినవన్నీ సాధించుకొని మీకు అండగా ఉంటారని చెప్పారు. జాతీయ పార్టీలని చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ది లేకుండా లేని పోనీ విమర్శలు చేయడం వారి చాతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని హామీలు ఇప్పుడు ఓట్ల కోసం సీట్ల కోసం గుర్తుకువస్తున్నాయని, ప్రజలు మళ్ళీ తగిన బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేసారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles