కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి పోతే ప్రజలే తిరగబడుతున్నరు..

Mon,November 19, 2018 04:36 PM

People protest against Congress leaders in campaign says jagadishreddy


సూర్యాపేట జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..సామాజిక న్యాయం పాటిస్తూ, తమకున్న వుహ్యంతో కోదాడలో బీసీ అభ్యర్థిని బరిలో నిలిపామన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి పోతే ప్రజలే తిరగబడుతున్నారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తుఫాన్ రాబోతుంది. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ గాలిలో కొట్టుకునిపోతాయన్నారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి ఎప్పుడో ఖాయమైందని స్ఫష్టం చేశారు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles