టీఆర్‌ఎస్‌కే మా ఓటు..వందల మంది ప్రతిజ్ఞ!

Fri,September 14, 2018 05:52 PM

people promise to vote trs party again

నిర్మ‌ల్: నిర్మ‌ల్ మండ‌లంలోని ఎల్ల‌పెల్లి గ్రామస్థులు రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్ద‌తు ప్రకటించారు. ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వెంటే ఉంటామని తీర్మానం చేశారు. ఎల్ల‌పెల్లిలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీకే త‌మ ఓటు వేస్తామ‌ని గ్రామ‌స్తులంతా ప్ర‌తిజ్ఞ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులతోనే టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, అన్నివర్గాల ప్రజలు తీర్మానం చేశారు.

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకొంటామని ఎల్ల‌పెల్లి గ్రామస్తులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతోనే టీఆర్‌ఎస్ వెన్నంటే ఉంటామని గ్రామస్తులంతా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ గౌడ్, యువ‌జ‌న నాయ‌కుడు అల్లోల గౌతం రెడ్డి , ఇత‌ర టీఆర్ఎస్ నేతలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles