సీఎం సభకు జనం భారీగా తరలివస్తారు: మంత్రి సత్యవతి

Wed,October 16, 2019 07:06 PM

హుజుర్ నగర్: హుజుర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తారని గిరిజన, శిశు-సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజుర్ నగర్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారు వస్తున్నారంటే ప్రజలు భారీ ఎత్తున తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. సీఎం సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం కానుందని ఆమె తెలిపారు. సీఎం కోసం హుజుర్ నగర్ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.


ఒక మహిళను ఓడించడానికి ఇంత మంది వస్తున్నారని అంటున్న పద్మావతి.. ఆనాడు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీద పోటీకి దిగినప్పుడు ఆ తెలివేమైందని ఆమె మండిపడ్డారు. శంకరమ్మను కుట్రలతో ఓడించిన ఆమె భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు వారించలేదు. ఉత్తమ్ దంపతులు ఆరోజు ఓ మహిళను ఓడగొట్టి, ఈరోజు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

కార్యక్రమంలో మంత్రులతో పాటు, ఉప ఎన్నిక ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, రవీంద్ర కుమార్, టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు తక్కెలపల్లి రవీందర్ రావు, పిల్లలమర్రి శ్రీనివాస్, దుడిమెట్ల బాల్ రాజ్ యాదవ్, పల్లా ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles