'లింగమంతుల జాతరను జయప్రదం చేయండి'

Sat,February 16, 2019 06:28 PM

హైదరాబాద్‌: పెద్దగట్టు జాతరగా ప్రాశస్త్యం పొందిన సూర్యాపేట జిల్లా దూరజ్‌పల్లి లింగమంతుల జాతర ఈ నెల 24న గంపల ప్రదర్శనతో ప్రారంభం కానుంది. జాతర గోడపత్రికను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సహకారంతో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి అనిర్వచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలన్నారు. నగరంలోని మంత్రుల నివాస ప్రాంగణంలో శనివారం సాయంత్రం జరిగిన జాతర గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కడారి సతీష్‌ యాదవ్‌, ఆలయ పాలకవర్గ సభ్యులు ఎం. మల్లయ్య, ఎం. జానకిరాములు, జటంగి నాగరాజు, మున్న వెంకన్న, బొల్లక సైదులు, మెంతబోయిన వెంకన్న, మొండికత్తి దుర్గమ్మ, ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

3677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles