తెలంగాణ నుండి యూరప్‌కు వేరుశనగ ఎగుమతులు

Sun,November 3, 2019 05:37 PM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నుండి యూరప్‌ దేశాలకు వేరుశనగ ఎగుమతులు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జర్మనీ-నెదర్లాండ్స్‌ దేశాల పర్యటనలో పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం ఆదివారం నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌ డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కురగాయల విత్తనోత్పత్తి కంపెనీలతో సమావేశమైంది. అనంతరం మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ నుండి యూరప్‌కు వేరుశనగ ఎగుమతులు చేస్తామన్నారు. దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమస్థానమన్నారు. రైతులకు లాభం చేకూర్చేలా దళారుల ప్రమేయం లేకుండా మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వేరుశనగ ఎగుమతులు జరిగేలా చూస్తామన్నారు. రబీలో ఏటా 2 లక్షల 50 వేల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతుందన్నారు. కురగాయ పంటల విత్తనోత్పత్తిలో రైతుకు ఎక్కువ లాభం ఉంటుందన్నారు. యూరప్‌లో పేరొందిన కూరగాయల విత్తన కంపెనీలు పలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. విత్తనోత్పత్తిని చేపడితే తెలంగాణ రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పందిరి జాతి, మిరప, బెండ, వంకాయ కూరగాయల విత్తనోత్పత్తిని చేపట్టి ఎగుమతిని ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles