భానుడి భగభగ.. నెమళ్లు విలవిల..

Tue,April 16, 2019 12:57 PM

peacock dies in Kamareddy dist

కామారెడ్డి : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మనషులైతే తమ నివాసాల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. భానుడి భగభగకు మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక నాలుగు నెమళ్లు మృతి చెందాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని నాగంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. నెమళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

2222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles